తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్య - కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్య
09:51 June 20
తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 20 గుంటల భూమికి పట్టా ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. తన భూమిని రెవెన్యూ అధికారులు లంచం తీసుకుని మరికొందరి పేరుపై పట్టా చేసినట్లు తెలిపాడు. ఆత్మహత్యకు రెవెన్యూ అధికారులే కారణమని లేఖలో చెప్పాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి స్వస్థలం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లిగా గుర్తించారు.
TAGGED:
former suicide news