సింగరేణి గనులకు లాక్‌డౌన్ ప్రకటించాలని మాజీ ఎంపీ, భాజపా కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి హైదరాబాద్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులందరికి కరోనా పరీక్షలు చేయాలన్నారు. భూగర్భ గనుల్లో కార్మికులు దగ్గరదగ్గరగా ఉండి పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులకు లాక్‌డౌన్ ప్రకటించాలి: మాజీ ఎంపీ వివేక్ - మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సింగరేణి కార్మికులకు లాక్‌డౌన్ డిమాండ్
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో సింగరేణి భూగర్భ కార్మికులకు లాక్‌డౌన్ ప్రకటించాలని మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు కార్మికులు అధికారులకు వైరస్ పాజిటివ్ వచ్చి మరణించారని, మరికొందరు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలోని 28 భూగర్భ గనులు, 19 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, అధికారులు ఇప్పటికే చాలా మంది వైరస్‌బారిన పడ్డారని ఆయన తెలిపారు. రామగుండం రీజియన్ పరిధిలోని ఓ గనిలో కరోనా వైరస్‌తో ఏకంగా ఇద్దరు కార్మికులు మృతి చెందగా, 20 మందికి పైగా కార్మికులు, అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. భూగర్భ గనులకు లాక్‌డౌన్ ప్రకటించి, కార్మికులందరికి లాక్‌డౌన్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.