కరోనా బాధితులకు చేయూతను అందించడానికి పోలీస్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి... వారికి అవసరమైన సామాగ్రితో పాటు, మందులను స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు గోదావరిఖని ఏసీపీ ఉమెందర్ (Acp Umender)పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ సెంటర్‌ను ఏసీపీ ప్రారంభించారు.
కొవిడ్ రోగులు బయట తిరిగితే కఠిన చర్యలు: ఏసీపీ ఉమెందర్ - Telangana news
పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కొవిడ్ బాధితులకు అవసరమైన సామాగ్రితో పాటు మందులను పంపిణీ చేస్తున్నట్లు గోదావరిఖని ఏసీపీ ఉమెందర్ పేర్కొన్నారు. కోవిడ్ బారినపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి 18 మందితో ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటు చేశామని అన్నారు. కొవిడ్ రోగులు ఇష్టం వచ్చినట్లు బయట తిరిగితే... వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనా బారినపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి.. ఒకటో పట్టణ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో 18 మందితో పోలీస్ టీమ్‌ని ఏర్పాటు చేశామని ఏసీపీ తెలిపారు. ఎప్పటికప్పుడు వారి అవసరాలను తెలుసుకొని సహాయం అందిస్తామన్నారు. గోదావరిఖని ప్రాంతంలో కొవిడ్ రోగులు బయట తిరుగుతున్నారన్న సమాచారం వస్తుందని, అలా ఇష్టం వచ్చినట్లు బయట తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైనా అవసరం ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులను, పోలీసులను సంప్రదించాలని ఏసీపీ ఉమెందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఉమాసాగర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 19 జిల్లాల్లో నేడు డయాగ్నోస్టిక్ కేంద్రాల ప్రారంభం