జిల్లాలో నూతన కోర్టు భవనాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టును ఆవిడ సందర్శించారు. కోర్టు పరిసరాలను పరిశీలించారు. జిల్లాలో పోక్సో కోర్టును సైతం ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు.
న్యాయవాదులతో సమావేశం నిర్వహించి.. కోర్టు ప్రాంగణంలో ఉన్న సమస్యలను ఇందిరా అడిగి తెలుసుకున్నారు. న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారికి పారదర్శకంగా సేవలు అందించాలని వారిని కోరారు. కోర్టు నిర్వాహణకు సంబధించి పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని.. న్యాయవాదులు ఆవిడకు వినతి పత్రం అందజేశారు.