పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తించే 98 మంది కార్మికులకు నిత్యావసరాలను స్థానిక వ్యాపారులు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు ఈ కార్యక్రమంలో పాల్గొని సరుకులను కార్మికులకు అందజేశారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, కిరాణా వర్తక, అడ్తి సంఘాలు సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. నిత్యావసరాలతోపాటు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు.
మంథనిలో మునిసిపల్ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - Manthani Municipality Workers Business People
పెద్దపల్లి జిల్లా మంథని పురపాలిక సిబ్బందికి స్థానిక వ్యాపారులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కిరాణ వర్తక, అడ్తి సంఘాల ఆధ్వర్యంలో సుమారు 98 మందికి సరుకులు అందించారు.
మంథనిలో మునిసిపల్ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ