పెద్దపల్లి జిల్లా రామగుండంలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వనజ హాజరయ్యారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆమె ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోనే రామగుండం నగరపాలక ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రామగుండం నగరపాలక కార్యాలయం అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్లాస్టిక్ వాడబోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక కమిషనర్ శ్రీనివాస్‌తో పాటు నగరపాలక సిబ్బంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి'
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రామగుండం నగరపాలక కమిషనర్, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.
'అందరూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి'