చిరు వ్యాపారస్థులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన - EENADU EETV AADVARYAM LO RYALY
ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.
![చిరు వ్యాపారస్థులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4625295-thumbnail-3x2-vysh.jpg)
చిరు వ్యాపారస్థులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
పెద్దపల్లి జిల్లా మంథనిలో పురపాలక సంఘం నుంచి ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అధికారులు, కార్మికులు, మెప్మా అధికారులు కలిసి పట్టణ వీధుల గుండా ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. కూరల మార్కెట్లో, బట్టల వ్యాపారస్థులకు, వినియోగదారులకు ప్లాస్టిక్ నిషేధం గురించి, దాని వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్మించి ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
చిరు వ్యాపారస్థులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన