తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల్లో నిర్లక్ష్యం వహించాడని ఏఈపై ఈఈ దాడి - గ్రామీణ నీటి సరఫరా విభాగం

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామీణ నీటి సరఫరా ఏఈపై  ఈఈ తిరుపతిరావు కర్రతో దాడిచేశారు. ఉద్యోగ సంఘాల నేతల ఫిర్యాదుతో అతణ్ని వ్యక్తిగత సెలవుపై ఉన్నతాధికారులు పంపించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించాడని ఏఈపై ఈఈ దాడి

By

Published : Apr 2, 2019, 7:35 AM IST

విధుల్లో నిర్లక్ష్యం వహించాడని ఏఈపై ఈఈ దాడి
విధుల్లోఅలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామీణ నీటి సరఫరా ఏఈ విలాస్​పై ఈఈ తిరుపతిరావు కర్రతో దాడి చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడిని ఖండించిన ఉద్యోగ సంఘాల నేతలు ఈఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు తిరుపతిరావును వ్యక్తిగత సెలవుపై వెళ్లాలని ఆదేశించారు.

మేడారంలో నీటి పంపు బిగించే పనిలో ఏఈ విలాస్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఈఈ తిరుపతిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా కర్రతో దాడి చేశారు. విలాస్​ కాలికి గాయం అయింది. ఈ ఘటనను అక్కడున్న ఉద్యోగులు వీడియో తీశారు.
ఇవీ చూడండి:అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్లు

ABOUT THE AUTHOR

...view details