పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో సుశీల్ కుమార్ అనే వైద్యుడు కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నాడు. రోజులాగా విధులకు రావాల్సిన సుశీల్ ఆదివారు ఆస్పత్రికి రాలేదు. కానీ... సుశీల్ కుమార్ స్థానంలో ప్రతిమ ఆస్పత్రిలో పనిచేసే రాజు అనే జూనియర్ డాక్టర్ విధులకు హాజరై వైద్యం చేస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా రోగులను పరిశీలిస్తూ... వైద్యం నిర్వహిస్తుండటాన్ని కొంతమంది గుర్తించారు. ఇదే విషయాన్ని రాజుతో ప్రశ్నిస్తే... సరైన సమాధానాలు చెప్పలేక ఆస్పత్రి నుంచి పారిపోయాడు.
ప్రభుత్వ వైద్యుని బదులు ప్రైవేటు జూడా విధులు - DUPLICATE DOCTOR DOING TREATMENT
మంథనిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో ఓ వైద్యునికి బదులు ప్రైవేటు జూనియర్ డాక్టర్ విధులు నిర్వహించాడు. అనుమానం వచ్చి నిలదీస్తే సమాధానం చెప్పలేక పారిపోయాడు.
DUPLICATE DOCTOR DOING TREATMENT