తెలంగాణ

telangana

ETV Bharat / state

నడి రోడ్డుపై తాగుబోతు హల్ చల్ - Drunk person Hull Chal in manthani peddapally district

రోడ్డుపై ఓ తాగుబోతు హల్​చల్​ చేశారు. వచ్చిపోయే వాహనాలకు అడ్డుపడుతూ.. రోడ్డుపై పడుకుంటూ.. ప్రయాణికులను గంటసేపు ఇబ్బందులకు గురిచేశాడు.

drunk-person-hull-chal-in-manthani-peddapally-district
నడి రోడ్డుపై తాగుబోతు హల్ చల్

By

Published : Feb 22, 2021, 4:21 AM IST

మద్యం సేవించిన ఒక వ్యక్తి పెద్దపెల్లి జిల్లా మంథని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై సుమారు గంట పాటు హల్ చల్ చేశాడు. వచ్చిపోయే వాహనాలకు అడ్డు పడుతూ, ఆపుతూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేశాడు. నడి రోడ్డుపై అడ్డంగా పడుకొని వాహనాలు వెళ్లకుండా అడ్డుపడ్డాడు.

మందుబాబు వింత చేష్టలతో బస్సులోని ప్రయాణికులు, ఇతర వాహనదారులు కొంతసేపు ఇబ్బందులు పడ్డారు. పోలీస్ కానిస్టేబుల్ వచ్చి పక్కకు తీసుకువెళ్లినా.... మళ్లీ రోడ్డు పైకి వచ్చి అటుగా వస్తున్న ఓ బస్సుకు అడ్డంగా పడుకున్నాడు. బస్ డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేక్ వేయడం వల్ల ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కూడా అతనిని పక్కకు లాగినా.. మళ్లీ బస్సు ముందుకు వచ్చి పడుకున్నాడు. ఈ హడావుడితో రోడ్డుపై కొద్దిసేపు వాహనాలు ఆగిపోయయి.

ఇదీ చూడండి:వ్యక్తిపై కత్తిలో దాడికి దిగిన తండ్రి కొడుకులు

ABOUT THE AUTHOR

...view details