తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగుండం కమిషనరేట్​ పరిధిలో డ్రోన్ నిఘా! - తెలంగాణ వార్తలు

లాక్​డౌన్ పటిష్ఠంగా అమలు చేయడానికి రామగుండం కమిషనరేట్ పరిధిలో డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల సాయంతో రోడ్లపై ఎవరైనా కనిపిస్తే వెంటనే చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆంక్షలు మరింత కఠినతరం చేశామని వెల్లడించారు.

Drone surveillance, ramagundam lock down
రామగుండంలో లాక్​డౌన్, రామగుండంలో డ్రోన్ నిఘా

By

Published : May 23, 2021, 7:32 AM IST

కరీంనగర్ జిల్లా రామగుండం పరిధిలో లాక్​డౌన్ అమలు తీరును డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బయట తిరిగేవారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘాను ఏర్పాటు చేసినట్లు రామగుండం కమిషనరేట్ ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆపరేట్ చేస్తూ పట్టణంలోని లాక్​డౌన్ అమలు తీరును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

సీఎం కేసీఆర్​ ఆదేశాలతో లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తూ లేనివారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తూ ఎక్కడైనా గుంపులుగా కనిపిస్తే పోలీసులు వెంటనే చర్యలు చేపడుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఉపేందర్, గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేష్ బాబు, ఎస్సై ఉమా సాగర్, రమేష్, సతీష్​లతోపాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అమానవీయం: ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి

ABOUT THE AUTHOR

...view details