పెద్దపల్లి జిల్లా రామగుండంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 129వ జయంతి నిర్వహించారు. రామగుండం నగరపాలక కార్యాలయంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్ ఆశయాలను నేటి యువతరం కొనసాగించాలని కోరారు.
'నేటి తరానికి అంబేడ్కర్ జీవితమే మార్గదర్శకం' - రామగుండం సీపీ సత్యనారాయణ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక కార్యాలయంలో అంబేడ్కర్ 129వ జయంతి నిర్వహించారు.
నేటి తరానికి అంబేడ్కర్ జీవితమే మార్గదర్శకం
నగరపాలక కార్యాలయ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పోలీసు కమిషనర్ సత్యనారాయణ పూలమాల వేసి నివాళి అర్పించారు. కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండటం వల్ల ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు అధికారులు పాల్గొన్నారు.
- ఇవీచూడండి:జర భద్రం.. మాస్కు లేకుంటే జరిమానా