తెలంగాణ

telangana

ETV Bharat / state

బొంతకుంటపల్లిలో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ - బొంతకుంట పల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్ట్​

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనం పనులపై ఆరా తీశారు.

collector sudden visit in bonthakuntapally village
బొంతకుంటపల్లిలో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

By

Published : Feb 6, 2020, 5:30 PM IST

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలం బొంతకుంటపల్లి గ్రామాన్ని పాలనాధికారి సిక్తా పట్నాయక్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, వ్యక్తిగత పారిశుద్ధ్యంపై ఆరా తీశారు.

గ్రామం పచ్చగా ఉండాలంటే... ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో నర్సరీనీ పరిశీలించి మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేడారం జాతర తర్వాత సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.

బొంతకుంటపల్లిలో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

ఇదీ చూడండి: ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details