తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీపాదరావు జయంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి శ్రీపాదరావు 83వ జయంతి వేడుకలు

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి శ్రీపాదరావు 83వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

sripada rao janthi celebrations in manthani
శ్రీపాదరావు జయంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

By

Published : Mar 2, 2020, 3:15 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి శ్రీపాదరావు 83వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీపాద చౌక్, రావుల చెరువు కట్టలోని శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. శ్రీపాద కాలనీ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని నాయకులు తెలిపారు.

శ్రీపాదరావు జయంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

ఇవీ చూడండి:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details