కరోనా కష్టకాలంలో నిరుపేదలకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నల గ్రామంలో కరోనా బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. భాజపా నాయకులు మల్లికార్జున్ గ్రామంలోని సుమారు 30 మంది కరోనా బాధిత కుటుంబాలను కలిసి… వారికి మనోధైర్యాన్ని కల్పించారు.
కరోనా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ - కాకా ఫౌండేషన్
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నల గ్రామంలో కరోనా బాధితులకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. దాదాపు 30 కొవిడ్ బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు.
కరోనా బాధితులకు నిత్యావరాలు పంపిణీ
కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ, భాజపా కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి సూచన మేరకు నిరుపేదలకు… నిత్యావసరాలతోపాటు ఉచిత భోజనాన్ని అందిస్తున్నామని నాయకులు మల్లికార్జున్ తెలిపారు. కార్యక్రమంలో తొగారి తిరుపతి, మధు, శివ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Kondagattu: నిరాడంబరంగా కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలు