తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేట్​ టీచర్లందరికీ భృతి అందించాలి' - demand for financial help to private teachers in ramagundam

కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు అధ్యాపకులందరికీ ఆపత్కాల భృతి అందించాలని గురుదక్షణ సంస్థ అధ్యక్షులు డిమాండ్​ చేశారు. రామగుండంలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని టీచర్లకు భృతి అందలేదని అన్నారు.

financial help to private teachers
ప్రైవేటు టీచర్లకు ఆపత్కాల భృతి

By

Published : May 7, 2021, 7:43 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ ఆపత్కాల భృతి అందించాలని.. గురుదక్షణ సంస్థ అధ్యక్షులు నరమల్ల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న భృతి అందని టీచర్లందరూ గోదావరిఖనిలోని శ్రీ ధర్మ శాస్త్ర ఆశ్రమంలో సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రతీ ఉపాధ్యాయుడిని ఆదుకుంటామని చెప్పిందని.. యాజమాన్యం మాత్రం కొంతమంది టీచర్ల పేర్లను మాత్రమే పంపించి మిగతా వారికి అన్యాయం చేసిందని విజయ్ కుమార్ ఆరోపించారు.

ప్రభుత్వానికి తప్పుడు నివేదిక పంపించి నిరుపేద ఉపాధ్యాయులకు భృతి అందకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: మసీదుల్లోనే ప్రార్థనలు నిర్వహించండి: హోం మంత్రి

ABOUT THE AUTHOR

...view details