పెద్దపల్లి జిల్లా మంథనిలో పండుగ సందడి నెలకొంది. దీపావళి సందర్భంగా పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచరించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. లక్ష్మీ పూజ, కేదారేశ్వర వ్రతం చేసుకునే భక్తులు... అవసరమైన పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు పోటెత్తగా... సందడి వాతావరణం నెలకొంది.
మంథనిలో పండుగ సందడి... డబ్బాల లెక్కన ఇసుక కొనుగోలు - manthani latest news
పెద్దపల్లి జిల్లా మంథనిలో పండుగ వాతావరణం నెలకొంది. పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. గోదావరి నిండుకుండగా మారటం వల్ల ఇసుకను పలువురు డబ్బాల లెక్కన అమ్ముతున్నారు. భక్తులు సైతం చేసేదేమీలేక... ఓ వైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే కొనుక్కుంటున్నారు.
గోదావరి నదీ... నీటితో కళకళలాడుతుండగా... భక్తులు ఇసుక దొరకక భక్తులు ఇబ్బదులు పడుతున్నారు. ఇదే ఆసరా చేసుకున్న కొంతమంది... ఆవతలి ఒడ్డు నుంచి ఇసుక తెచ్చి అమ్ముకుంటున్నారు. గోదావరి ఒడ్డున ఇసుక అమ్మకాలు డబ్బాలతో చేపట్టడాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. చేసేదేమీలేక డబ్బులు చెల్లించి కొనుక్కుపోతున్నారు.
పూజకు అవసరమైన దారాలు, కంకణాలు, పసుపు కుంకుమలు, కొత్త కుండలు, చాటలు, ప్రమిదలు, రంగురంగుల పుష్పాలు కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు ధరలు అధికంగా ఉంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు గతేడాది కంటే ఈసారి సరైన గిరాకీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.