తెలంగాణ

telangana

ETV Bharat / state

పంప్​హౌస్ పక్కగోడకు పగుళ్లు.. అప్రమత్తమైన అధికారులు - Cracks to the side wall of Parvathi_Pumphouse in peddapalli

పెద్దపల్లి జిల్లా గోలివాడలోని పార్వతి పంప్​హౌస్ డెలివరీ సిస్టర్న్ వద్ద పక్కగోడకు పగుళ్లు ఏర్పడగా అధికారులు అప్రమత్తమై తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గోడకు కింది నుంచి పైవరకు రంధ్రాలు చేసి ఇనుపరాడ్​ ముక్కలతో బిగించారు.

Cracks to the side wall of Parvathi_Pumphouse in peddapalli
పంప్​హౌస్ పక్కగోడకు పగుళ్లు.. అప్రమత్తమైన అధికారులు

By

Published : Dec 29, 2019, 12:05 PM IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతిపంపు హౌస్‌ డెలివరీ సిస్టర్న్‌ వద్ద పక్కగోడకు పగళ్లు ఏర్పడగా అధికారులు అప్రమత్తమయ్యారు. పగుళ్లను ఇటీవలే గుర్తించిన అధికారులు మరింత విస్తరించకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

ఇనుప రాడ్ ముక్కలతో బిగింపు..

పగుళ్లకు ఇరువైపుల గోడకు ముందువైపున కింది నుంచి పైవరకు రంధ్రాలు చేసి ఇనుపరాడ్‌ ముక్కలతో బిగించారు. అయినా ఫలితం లేనందున గోడ లోపలి భాగంలో మట్టితవ్వి పెద్ద ఇనుపరాడ్‌ ముక్కలతో బిగింపు పనులు చేపడుతున్నారు.

డెలివరీ సిస్టర్న్ ఇరువైపులా గోడ నిర్మాణం..

మోటర్లతో నీటిని ఎత్తిపోసే క్రమంలో డెలివరీ సిస్టర్న్‌ ముందు భాగంలో పటిష్ఠంగా ఉండేందుకు అదనంగా ఇరువైపులా గోడలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. గోడ అతుకు దగ్గర ఏర్పడిన పగుళ్లతో ఎలాంటి ప్రమాదం లేదని అవసరమైతే గోడను పూర్తిగా తొలగించి పునర్నిర్మిస్తామని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.

పంప్​హౌస్ పక్కగోడకు పగుళ్లు.. అప్రమత్తమైన అధికారులు

ఇవీ చూడండి:అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!

ABOUT THE AUTHOR

...view details