కరోనా వ్యాప్తి నియంత్రణలో తెరాస ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సీపీఎం నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు.
'ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి' - రాష్ట్రంలో కరోనా పరీక్షలు అధికంగా నిర్వహించాలంటూ సీపీఎం నేతలు పెద్దపల్లిలో ధర్నా
ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో భారీగా వచ్చిన విద్యుత్ బిల్లుల్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.
'ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించండి'
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఈ వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే లాక్డౌన్ నేపథ్యంలో భారీగా వచ్చిన విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే బిల్లుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు