కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ కార్యకర్తలు అంతా ఐక్యం కావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సీపీఐ నిర్మాణ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నిర్మాణ సభలు: చాడ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామాల్లో సీపీఐ నిర్మాణ సభలు నిర్వహించి కార్యకర్తలను చైతన్యవంతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఏడేళ్లుగా పాలన సాగిస్తున్న కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినట్లు ఆరోపించారు.
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మతకల్లోలాలు సృష్టించేందుకు సీఏఏ, ఎన్ఆర్సీ వంటి బిల్లులు తీసుకొచ్చినట్లు చాడ ఆరోపించారు. దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసినందుకు ప్రధాని కుట్ర పన్నినట్లు ధ్వజమెత్తారు. అలాగే తెలంగాణలో ఏడేళ్లుగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్లు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామాల్లో సీపీఐ నిర్మాణ సభ నిర్వహించి కార్యకర్తలను చైతన్యవంతం చేస్తామని వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:త్వరలో టీస్బీపాస్ తీసుకొస్తాం: కేటీఆర్