తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్​, డీజిల్​ ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. సీపీఐ శ్రేణులు కారుకు తాళ్లు కట్టి లాగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

By

Published : Jun 22, 2020, 12:32 AM IST

cpi leaders protest to cut petrol and diesel prices in peddapalli district
పెట్రోల్​, డీజిల్​ ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా భాస్కర్​రావు భవన్ నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు సీపీఐ శ్రేణులు కారుకు తాళ్లను కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టినా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ అన్నారు.

రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సదానందం నారాయణ, మల్లయ్య, దినేష్, తదితరులు పాల్గొన్నారు.



ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన

ABOUT THE AUTHOR

...view details