45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. డీజీపీ ఆదేశాల మేరకు వైద్య సిబ్బందితో పాటు, పోలీసు సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని సీపీ సూచించారు.
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న రామగుండం సీపీ - covid help centre in godavarikhani government hospital
గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ సహాయకేంద్రాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ ప్రారంభించారు. కరోనా రోగులతో పాటు వారి బంధువుల సౌకర్యార్థం ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు సీపీ తెలిపారు.
గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ సహాయ కేంద్రం, రామగుండం సీపీ
అనంతరం సీపీ కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఆయన సూచించారు.
ఇదీ చదవండి:కొవిడ్ ఔషధాలకు మార్కెట్లో కొరత.. 2 నెలల్లో వినియోగం రెట్టింపు