మద్దతు ధర ఏదని పత్తి రైతుల ఆందోళన - peddapalli market committee
పత్తిరైతు ఆగ్రహం రోజురోజుకు ఎక్కువవుతోంది. ఓవైపు కొనుగోళ్లలో జాప్యం, మరోవైపు మద్దతు ధర లభించకపోవడంపై భగ్గుమంటున్నారు. పెద్దపల్లిలో వరుసగా రెండోరోజు నిరసనలకు దిగారు.
పెద్దపల్లి జాతీయ వ్యవసాయ మార్కెట్కు వరుసగా సెలవుల అనంతరం... మంగళవారం తెరుచుకుంది. జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున పత్తిని అమ్మేందుకు తీసుకొచ్చారు. సుమారు 4 వేల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదనపు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల రద్దీ పెరిగి రైతులు మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీనిపై రైతులు నిరసనకు దిగారు. జాప్యాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసుల రాకతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. ఇవాళ కూడా తూకం నిలిచిపోవడం.. మద్దతు ధర లేదని రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు.