తెలంగాణ

telangana

ETV Bharat / state

నేను ఆసుపత్రిలో ఉండను.. కరోనా బాధితుడి హల్​చల్​

పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగి హల్​చల్​ చేశాడు. తాను ఇంటికి పోతానంటూ ఆసుపత్రి ఆవరణలోకి వచ్చి... వైద్య సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు.

Corona patient Hull Chal in peddapalli government hospital
ఐసోలేషన్​ వార్డులోంచి బయటకొచ్చి.. కరోనా పేషెంట్​ హల్​చల్​

By

Published : Jul 10, 2020, 11:58 AM IST

Updated : Jul 10, 2020, 12:51 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరోనా వ్యాధిగ్రస్తుడు హల్​చల్​ సృష్టించాడు. రామగుండంకు చెందిన వ్యక్తికి గురువారం కరోనా పాజిటివ్​ రావడం వల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్​ వార్డుకు తరలించారు.

గురువారం రాత్రి వ్యాధిగ్రస్తుడు తాను ఇంటికి వెళ్లిపోతానని బట్టల సంచితో బయల్దేరడంతో వైద్య సిబ్బంది ఆందోళన చెందారు. ఐసోలేషన్​ వార్డు నుంచి ప్రభుత్వాసుపత్రి ఆవరణలోకి వచ్చి.. గంటసేపు ఇబ్బంది పెట్టాడు. చివరకు శుక్రవారం ఇంటికి పంపిస్తామని పెద్దపల్లి ఎస్సై రాజేష్​తో పాటు వైద్యసిబ్బంది వారించడం వల్ల ఐసోలేషన్​ వార్డులోపలికి వెళ్లిపోయాడు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నేను ఆసుపత్రిలో ఉండను.. కరోనా బాధితుడి హల్​చల్​

ఇవీ చూడండి:ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు

Last Updated : Jul 10, 2020, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details