పెద్దపెల్లి జిల్లా రామగుండం అర్జీ-1 ఏరియాలోని 11ఏ బొగ్గుగనిలో ఉదయం షిఫ్ట్‌లో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. అనంతరం గనిపై నిరసన చేపట్టారు. కరోనా లక్షణాలతో పలువురు కార్మికులు మృతి చెందారని, పలువురు వైరస్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని , వెంటనే లాక్డౌన్ ప్రకటించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
సింగరేణిలో కరోనా… ఆందోళనలో కార్మికులు! - రామగుండం వార్తలు
రోజురోజుకు సింగరేణి బొగ్గు గనుల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కొవిడ్-19 బారిన పడి.. ఒక కార్మికుడు మృతి చెందడం వల్ల సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ ప్రకటించి తమకు రక్షణ కల్పించాలని, లేనియెడల స్వచ్ఛందంగా విధులు బహిష్కరిస్తామని కార్మికులు స్పష్టంచేశారు.
సింగరేణిలో కరోనా… ఆందోళనలో కార్మికులు!
యాజమాన్యం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఇంటికి వెళ్ళిపోయారు. గనుల్లో పనిచేసే కార్మికుల్లో ఎవరికి కరోనా ఉందోనన్న ఆందోళన వారి కుటుంబాల్లో సైతం నెలకొంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికుల భద్రత గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఇళ్లలోనే ఉంటామని కార్మికులు తెలిపారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు