పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లెనిన్ నగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఏసీపీ ఉపేందర్ ఇంటింటి సోదాలు నిర్వహించారు.
సరైన పత్రాలు లేని 139 ద్విచక్రవాహనాలు స్వాధీనం
అపరిచిత వ్యక్తులు కనబడితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి డీసీపీ రవీందర్ సూచించారు. పట్టణంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించి.. సరైన పత్రాలు లేని 139 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు లేని 139 ద్విచక్రవాహనాలు స్వాధీనం
కాలనీలో అపరిచిత వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 139 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి:'ఆరు నెలల్లోపు పట్టణ ప్రగతి కనిపించాలి'