తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథనిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని మారుమూల గ్రామం ఆరెందలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో మంథని నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టారు.

మావో ప్రభావం నేపథ్యంలో మారుమూల గ్రామంంలో కార్జెన్ సెర్చ్
మావో ప్రభావం నేపథ్యంలో మారుమూల గ్రామంంలో కార్జెన్ సెర్చ్

By

Published : Sep 20, 2020, 9:34 AM IST

రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిధిలోని ఆరెందలో నిర్భంద తనిఖీలు చేపట్టారు. గతంలో మావోయిస్టులకు నిలయమైన మంథని, ఆరేంద గ్రామంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి లొంగిపోయిన మాజీ మావోయిస్టులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు.

మావో ప్రభావం నేపథ్యంలో మారుమూల గ్రామంంలో కార్జెన్ సెర్చ్

ఆ మార్గాల్లో వెళ్లకండి..

యువత చెడు మార్గాల వైపు ప్రయాణించకుండా సన్మార్గంలో నడవాలని తగిన సూచనలు చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎంతటివారైనా సరే చట్టపరంగా శిక్షలు అమలు పడే విధంగా చేస్తామని డీసీపీ రవీందర్ హెచ్చరించారు. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, శిక్షణ ఐపీఎస్ అశోక్ కుమార్, మంథని సీఐ రామగిరి, కమాన్​పూర్ ఎస్ఐ, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

మావో ప్రభావం నేపథ్యంలో మారుమూల గ్రామంంలో కార్జెన్ సెర్చ్

ఇవీ చూడండి : జగిత్యాలలో నిషేధిత గుట్కా పట్టివేత

ABOUT THE AUTHOR

...view details