తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరంతో కళకళ... పార్వతి బ్యారేజీకి జలకళ

పెద్దపల్లి జిల్లా గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంప్‌హౌస్ నుంచి పార్వతి బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. మూడు మోటార్లతో నీటిని నిరాటంకంగా వదులుతున్నారు. పార్వతి బ్యారేజీ పూర్తి సామర్థ్యం 8.83టీఎంసీలు కాగా... ప్రస్తుతం 5.95 టీఎంసీల నీటి నిల్వతో జలకళను సంతరించుకుంది.

continues-water-flow-from-saraswathi-barrage-to-parvati-barrage-at-gunjapadugu-manthani-mandal-in-peddapalli-district
నిరాటంకంగా ఎత్తిపోతలు... పార్వతి బ్యారేజీకి జలకళ!

By

Published : Jan 27, 2021, 4:08 PM IST

నిరాటంకంగా ఎత్తిపోతలు... పార్వతి బ్యారేజీకి జలకళ!

కాళేశ్వరం ఎత్తిపోతలతో గోదావరి నీటితో వివిధ ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంప్ హౌస్‌లో 12 మోటార్లకు గాను మూడు మోటార్లను రన్ చేస్తూ పార్వతి బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. సుమారు 3నెలల తర్వాత సరస్వతి పంప్ హౌస్‌లో మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభించి... నిరాటంకంగా మూడు మోటార్లను రన్ చేస్తూ 6 పైపుల ద్వారా నీటిని పార్వతి బ్యారేజీలోకి పంపుతున్నారు.

సరస్వతి పంప్ హౌస్ నుంచి బుధవారం 6 పైపుల ద్వారా 8,679 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు. పార్వతి బ్యారేజీ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 5.95 టీఎంసీల నీటి నిల్వతో జలకళను సంతరించుకుంది.

ఇదీ చదవండి:'ఒక్క ప్రాజెక్టులోనైనా అవినీతిని చూపించగలిగారా?'

ABOUT THE AUTHOR

...view details