తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలి' - Congress dharna in Basant Nagar, Palakurti mandal, Peddapalli district

రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ రహదారిపై ధర్నా నిర్వహించారు.

Congress dharna to repeal agriculture bills
వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని కాంగ్రెస్ ధర్నా

By

Published : Jan 6, 2021, 6:36 PM IST

రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ రహదారిపై నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.

రద్దు సరికాదు..

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటిని రద్దు చేయడం సరికాదన్నారు. మహిళా, సహకార సంఘాల ద్వారా వరి కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు, హమాలి సంఘాలకు లబ్ధి చేకూరింది. గ్రామాల్లో అన్నదాతలు అభివృద్ధి చెందారు. ప్రస్తుత ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను రద్దు చేశాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.

-రాజ్ ఠాకూర్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్

ఇదీ చూడండి:కోర్టు కేసుల పేరుతో టీఎస్​పీఎస్సీ కాలక్షేపం : ఆర్​.కృష్ణయ్య

ABOUT THE AUTHOR

...view details