తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి' - కాంగ్రెస్ వార్తలు

రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కర్మాగారంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు.

congress-protest-at-godavarikhani-at-peddapalli-district
'ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి'

By

Published : Mar 18, 2021, 5:29 PM IST

అర్హులైన పేదవారికి తెల్ల రేషన్ కార్డులను, పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రాజ్​ ఠాకూర్ దీక్షను ప్రారంభించారు.

ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఒక్కరికి పెన్షన్, రేషన్ కార్డు ఇవ్వలేదని రాజ్​ఠాకూర్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై స్పందించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నూతనంగా ఏర్పడిన రామగుండం ఎరువుల కర్మాగారంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు దీక్ష చేపట్టామన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details