తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏ ప్రాంతంలో ఎన్నికలుంటే... ఆ ప్రాంతానికి నిధులా..?: శ్రీధర్​బాబు - Budget 2020

భాజపా, తెరాస రెండూ ఒకటేనన్నారు మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. దీనిపై ప్రశ్నించడంలో తెరాస ఎంపీలు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

ఏ ప్రాంతంలో ఎన్నికలుంటే... ఆ ప్రాంతానికి నిధులు: శ్రీధర్​బాబు
ఏ ప్రాంతంలో ఎన్నికలుంటే... ఆ ప్రాంతానికి నిధులు: శ్రీధర్​బాబు

By

Published : Feb 3, 2021, 2:59 PM IST

Updated : Feb 5, 2021, 12:30 AM IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు. బడ్జెట్​లో విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు రావాల్సిన, ఇవ్వాల్సిన నిధుల గురించి ప్రస్తావన లేకపోవడం నిరాశ గురి చేసిందన్నారు. తెరాస ఎంపీలు మీడియా సమావేశాలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

పెద్దపల్లి జిల్లా మంథని క్యాంపు కార్యాలయంలో శ్రీధర్​బాబు మీడియా సమావేశం నిర్వహించారు. బడ్జెట్​లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రశ్నించడంలో తెరాస ఎంపీలు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడం లేదని మండిపడ్డారు.

ప్రధానమంత్రి మోదీ ఇప్పటి వరకు కనీసం లక్ష మందికి కూడా ఉద్యోగ భద్రత కల్పించలేక విఫలమయ్యారన్నారు. భాజపా, తెరాస రెండూ ఒకటేనని ఆరోపించారు. భాజపా ఏ ప్రాంతంలో ఎన్నికలు ఉంటే అక్కడ నిధులు విడుదల చేసి, అక్కడి ఓటర్లను ప్రలోభ పెడుతోందని మండిపడ్డారు. అన్ని రంగాల్లో విఫలమైన భాజపా... దేశంలోని 130 కోట్ల మందిని మోసం చేసిందన్నారు.

ఏ ప్రాంతంలో ఎన్నికలుంటే... ఆ ప్రాంతానికి నిధులా..?: శ్రీధర్​బాబు

ఇదీ చూడండి:మొన్న కోళ్లు.. నిన్న కాకులు.. ఇవాళ కుక్కలు

Last Updated : Feb 5, 2021, 12:30 AM IST

ABOUT THE AUTHOR

...view details