రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టనున్న ఛలో పెద్దపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామగుండం నియోజకవర్గ ఇంఛార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని దుర్గనగర్లో కార్పొరేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు.
'ఛలో పెద్దపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి' - peddapally news
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని దుర్గనగర్లో రామగుండం కార్పొరేషన్ నాయకులతో ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సమావేశం నిర్వహించారు. శుక్రవారం చేపట్టనున్న ఛలో పెద్దపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
congress meeting in ramagundam
రేపు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. అటు మోదీ, ఇటు కేసీఆర్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగానే నూతన వ్యవసాయ బిల్లు ఉందని దుయ్యబట్టారు. కేంద్రం చేసే ప్రతీ ఆలోచనకి తెరాస మద్దతు ఇస్తుందని ఆరోపించారు.