తెలంగాణ

telangana

'వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది'

By

Published : Jan 11, 2021, 5:13 PM IST

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను కేెంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Congress leaders staged agitation in Peddapalli district center against the farmer bill introduced by the Center
'వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది'

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నూతన వ్యవసాయ చట్టాల కారణంగా వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమురయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'కొత్త వ్యవసాయ చట్టాల వలన వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల విషయంలో తన వైఖరి మార్చుకోవాలి'.

-కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

ఇదీ చదవండి: మహిళపై అత్యాచారం- ఆపై జననాంగంపై దాడి

ABOUT THE AUTHOR

...view details