తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2020, 3:42 PM IST

ETV Bharat / state

రైతుల సమస్యల పరిష్కారించాలని కాంగ్రెస్​ ధర్నా

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Congress leaders protest in Peddapalli district center
రైతుల సమస్యల పరిష్కారించాలని కాంగ్రెస్​ ధర్నా

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు రైతులతో కలిసి పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు సన్నరకం వరి ధాన్యానికి 2500 చొప్పున మద్దతు ధర కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే దొడ్డు రకం క్వింటాల్ వరి ధాన్యానికి రెండు వేల మద్దతు ధర కేటాయించాలని కోరారు. అలాగే రైతులను ఆదుకునేందుకు అన్ని మార్కెట్ యార్డుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సైతం ప్రభుత్వం మద్దతు ధర కేటాయించాలని అన్నారు. కౌలు రైతులకు సైతం రైతు బంధు పథకం వర్తింపు చేసేలా ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details