తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే నాసిరకం రోడ్లు'

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నాసిరకం రోడ్లకు కారణమైన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే నాణ్యత లోపించిందని ఆరోపించారు. నెల రోజులు గడవక ముందే రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

congress leaders protest against road contractors in peddapalli district
'స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే నాసిరకం రోడ్లు'

By

Published : Nov 7, 2020, 6:49 PM IST

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల చేపట్టిన రాజీవ్ రహదారి మరమ్మతు పనులు నాసిరకంగా నిర్వహించిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. గుంతలు పడిన రోడ్డును కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పరిశీలించారు. నెల రోజులు పూర్తి కాకముందే రహదారిపై గుంతలు ఏర్పడటం నాసిరకం పనులకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపించారు.

గుత్తేదారులపై చర్యలు తీసుకోకపోతే నాసిరకం రహదారి పనులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు.

ఇదీ చదవండి:ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి

ABOUT THE AUTHOR

...view details