తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్ గాంధీ దూరదృష్టి గల నాయకుడు: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు - telangana news

మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రాహుల్ గాంధీ దూరదృష్టి కలిగిన నాయకుడని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలనేది ఆయన ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

rahul gandhi, mla sridhar babu
రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

By

Published : Jun 19, 2021, 3:10 PM IST

దేశ సమగ్రతతో పాటు దూరదృష్టి కలిగిన నాయకుడే రాహుల్ గాంధీ అని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కొనియాడారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పురోహితులను, మత గురువులను శాలువాలతో సత్కరించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం నుంచి వచ్చినా‌... ప్రధానమంత్రి పదవి అవకాశం వస్తే చేపట్టలేదని అన్నారు.

దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలనేది రాహుల్ గాంధీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయన కృషి చేస్తారని పేర్కొన్నారు. త్వరలో ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:ఆస్తి కోసం కన్నవారిని.. తోబుట్టువును కడతేర్చాడు!

ABOUT THE AUTHOR

...view details