ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద భాజపా, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రియల్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు' - భాజపా, కాంగ్రెస్ ధర్నా
ప్రభుత్వం అధికారులు కుమ్మక్కై.. ఎల్ఆర్ఎస్ విధానంతో ప్రజలను దోచుకుంటున్నారని భాజపా, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగి.. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.
!['ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు' congress-and-bjp-leaders-protest-against-on-lrs-portal-in-peddapalli-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9886663-thumbnail-3x2-lrs.jpg)
'ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు'
అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం, స్థానిక అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై ఎల్ఆర్ఎస్ పేరుతో దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని రద్దు చేసేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'ఎల్ఆర్ఎస్, ధరణి ఫోర్టల్ను రద్దు చేయాలి'