పెద్దపల్లి జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా ఎలిగేడు మండలం బుర్రమియాపేట గ్రామంలో కలెక్టర్ శ్రీదేవసేన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత పరిశుభ్రతపై ఆరా తీశారు. ప్రజలంతా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. అలాగే వీధుల్లో చెత్త వెయ్యకుండా తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు.
స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీదేవసేన - పెద్దపల్లి జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛ శుక్రవారం
ప్రతి శుక్రవారం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా విధించాలని అధికారులను కోరారు.
స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీదేవసేన
ఇదీ చూడండి : హైదరాబాద్లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
TAGGED:
తెలంగాణ వార్తలు