పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తే... స్వచ్ఛ పట్టణాలు ఏర్పడతాయని పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులను కలెక్టర్ ఇవాళ పరిశీలించారు.
స్వచ్ఛ పట్టణాలుగా మార్చుదాం: పెద్దపల్లి కలెక్టర్ - పట్టణ ప్రగతి
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. పట్టణ అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
స్వచ్ఛ పట్టణాలుగా మార్చుదాం: పెద్దపల్లి కలెక్టర్
ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ ఛైర్మన్ ముత్యం సునీతతో పాటు అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కొత్తగా ఏర్పడిన సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఏం కావాలో నివేదికలు తయారు చేసుకుని అందుకు అనుగుణంగా పనులు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ పాటించి... స్వచ్ఛ పట్టణాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
ఇవీ చూడండి:'ఒక్కరు కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా...'