తెలంగాణ

telangana

పెద్దపల్లి జిల్లా కలెక్టర్​గా కె. శశాంకకు అదనపు బాధ్యతలు

కరీంనగర్ జిల్లా కలెక్టర్​ కె.శశాంక పెద్దపల్లి పాలనాధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు పెద్దపల్లిలోని కలెక్టర్​ ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించారు.

By

Published : Oct 27, 2020, 8:08 PM IST

Published : Oct 27, 2020, 8:08 PM IST

collector Shashanka took additional charges as Peddapalli District Collector
పెద్దపల్లి జిల్లా కలెక్టర్​గా కె. శశాంకకు అదనపు బాధ్యతలు

కరీంనగర్ జిల్లా కలెక్టర్​గా విధులు నిర్వహిస్తున్న శశాంక అదనపు బాధ్యతల కింద పెద్దపల్లి జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు పెద్దపల్లి కలెక్టర్ ఛాంబర్​లో నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్​ శశాంకను అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాద పూర్వకంగా కలిశారు.

పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉందని కలెక్టర్​ శశాంక పేర్కొన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ.. జిల్లాకు ఉన్న మంచి పేరును మరింత పెంచేలా పని చేస్తానని తెలిపారు. ఇందుకు అందరి సహకారం కావాలని కోరారు.

ఇదీ చూడండి.. 'రైతుల పొట్టకొట్టేందుకే మొక్కజొన్న దిగుమతి'

ABOUT THE AUTHOR

...view details