నిరుపేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని అన్ని విధాలా ఆదుకునేందుకే ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేస్తున్నామని శాసనమండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావు పేర్కొన్నారు. పెద్దపల్లిలో పర్యటించిన భానుప్రసాదరావు... పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
'నిరుపేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ' - ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
పెద్దపల్లిలో శాసనమండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావు పర్యటించారు. పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఆదుకోని విధంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసి వారికి ఆర్థికంగా చేయూత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
'నిరుపేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ'
ప్రజలు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఆదుకోని విధంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసి వారికి ఆర్థికంగా చేయూత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు హామీ ఇచ్చారు.