CM KCR peddapally tour ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కరీంనగర్ బైపాస్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీతో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చేరుకోనున్నారు. ముందుగా రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
శామీర్ పేట నుంచి సిద్దిపేట వరకు దారిపోడువున వందలాది కార్లు ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో చేరేలా ఏర్పాట్లు చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు జరిగాయి. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రాహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద ముఖ్యమంత్రి ఆగే అవకాశం ఉంది. దీనితో భారీ బందోబస్తుపై అధికారులు దృష్టిసారించారు. 2500 నుంచి 5000 కార్లతో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.