తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ జన్మదినోత్సవం.. కాళేశ్వర జలాలతో అభిషేకం - గోదావరిఖనిలో సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు

పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్​ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కేక్​ కట్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో కేసీఆర్​ చిత్రపటానికి అభిషేకం చేశారు.

cm kcr birthday celebrations, ramagundam
సీఎం కేసీఆర్​ పుట్టిన రోజు వేడుకలు

By

Published : Feb 17, 2021, 12:40 PM IST

పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం బొగ్గుగని అర్జీ-1 ఏరియాలోని జీడీకే నంబరు 2 ఇంక్లైన్​లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిలతో కలిసి 65 కిలోల కేక్​ కట్ చేశారు. అనంతరం గని ఆవరణలో మొక్కలు నాటారు.

రామగుండం జీడీకే 2 ఇంక్లైన్​లో 65 కిలోల కేక్​ కట్​ చేస్తున్న తెరాస నాయకులు

గోదావరిఖనిలోని గోదావరి సమీపంలో టీబీజీకేఎస్​ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. గోదావరినది సమీపంలో శివునికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదారమ్మకు హారతిచ్చి, సీఎం చిత్రపటానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం చేశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

అపర భగీరథుడు

వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి బీడు పడ్డ తెలంగాణ భూములకు మళ్లించిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్​కు.. కాళేశ్వరం నీటితో అభిషేకం చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ అన్నారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో ఉచిత విద్యుత్తుతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి, రైతు వేదికలను స్థాపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

ఇదీ చదవండి:పదివేల మొక్కలు నాటే కార్యక్రమానికి హరీశ్​ శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details