హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య లాంటి ఘటనలు తెలంగాణలో జరుగుతాయని ఉహించలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో వామన్‌రావు తండ్రి కృష్ణయ్యను.. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి భట్టి పరామర్శించారు. బాధితులకు ప్రాణభయం ఉందని తమకు చెప్పారని.. ఇదే విషయమై రాష్ట్ర హోంశాఖ మంత్రి, డీజీపీకి లేఖలు రాస్తామన్నారు.
ఈ హత్య ఘటనలో ఎంతో మంది పెద్దల హస్తం ఉందని భట్టి ఆరోపించారు. హత్యజరిగిన 24 గంటలు గడిచినా.. సీఎం, మంత్రులు ఖండించలేదని భట్టి అన్నారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని.. సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.