NTPC Contract Laborers protest : పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆగస్టుతో ఒప్పంద ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో పాతడిమాండ్లపై యాజమాన్యంతో చర్చించేందుకు ఒప్పంద కార్మికులు యత్నించారు. అక్కడకి వెళ్తున్న వారిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అడ్డుకోగా ఒప్పంద కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఐఎస్‌ఎఫ్, ఒప్పంద కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు భద్రతాసిబ్బంది లాఠీఛార్జ్ చేశారు.
ఎన్టీపీసీ రణరంగం, పోలీసులకు, ఒప్పంద కార్మికుల మధ్య ఘర్షణ - NTPC Contract Laborers protest today
NTPC Contract Laborers protest రామగుండం ఎన్టీపీసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆగస్టుతో ఒప్పంద ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో పాతడిమాండ్లపై యాజమాన్యంతో చర్చించేందుకు ఒప్పంద కార్మికులు యత్నించారు. అక్కడకి వెళ్తున్న వారిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు.. ఒప్పంద కార్మికులను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఎన్టీపీసీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
"నాలుగు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం మేం ధర్నా నిర్వహిస్తున్నాం. ఇంతలోనే సీఐఎస్‌ఎఫ్ పోలీసులు వచ్చి మాపై దాడి చేశారు. యాజమాన్యం చర్చించాల్సిన పద్ధతి ఇదేనా. వెంటనే మాపై దాడి చేసిన అధికారిని సస్పెండ్ చేయాలి. న్యాయమైన మా డిమాండ్లను పరిష్కరించాలి. యాజమాన్యం మాతో చర్చలు జరపాలి. " - కార్మిక సంఘాల జేఎసీ