ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తోన్న కార్మికులందరికీ వెంటనే కొవిడ్ టీకాలను అందించాలంటూ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను (anti-labor policies) నిరసిస్తూ.. అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ ఆందోళన - కార్మికులకు ఉచిత కొవిడ్ టీకాలు
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను (anti-labor policies) నిరసిస్తూ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఐటీయూ నేతలు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ.. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
anti-labor policies
కార్మికులందరికీ రూ. 50 లక్షల ప్రమాద బీమాను కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Attack: పోలీసునని చెప్తున్నా వినకుండా కానిస్టేబుల్‌పై దాడి