తెలంగాణ

telangana

ETV Bharat / state

భగీరథ కేంద్రంలో గ్యాస్​ లీక్​.. కార్మికులకు అస్వస్థత - భగీరథ కేంద్రంలో గ్యాస్​ లీక్​.

పెద్దపల్లి జిల్లా మూర్​మూర్​ గ్రామంలోని మిషన్​ భగీరథ నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్​ గ్యాస్​ సిలిండర్​ లీక్​ అయింది. అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులతో పాటు సూపర్​ వైజర్​ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

chlorine gas pipes are leaked and six members fall unconsious in mission bhageeratha water plant
పెద్దపల్లిలో భగీరథ కేంద్రంలో గ్యాస్​ లీక్

By

Published : Dec 6, 2019, 10:16 AM IST

పెద్దపల్లిలో భగీరథ కేంద్రంలో గ్యాస్​ లీక్

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మూర్‌మూర్‌లోని మిషన్‌ భగీరథ నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్‌ గ్యాస్‌ సిలండర్‌ లీక్‌ అయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆరుగురు కార్మికులతో పాటు సూపర్‌ వైజర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

గమనించిన స్థానికులు కార్మికులను గోదావరిఖని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గోదావరి నుంచి నీటిని మోటార్ల ద్వారా పంప్‌హౌజ్‌లోకి తరలించిన తర్వాత ఆ నీటిలో క్లోరిన్‌ను కలుపుతారు. ఈ క్రమంలో సిలిండర్‌లోని క్లోరిన్‌ నీటిలో కలుపుతుండగా ఒక్కసారి గ్యాస్‌ లీకై, అక్కడై విధులు నిర్వహిస్తున్న వారు స్పృహ తప్పి పడిపోయారు.

పంప్‌హౌజ్​కు రెండు కిలోమీటర్ల మేర గ్యాస్‌ వ్యాపించడం వల్ల గోదావరిఖని అగ్నిమాపక సిబ్బంది చేరుకుని గ్యాస్‌ లీకేజీని ఆరికట్టారు. అధికారులు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. వెంటనే అధికారులపై చర్యలు తీసుకుని, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details