కేంద్ర కాలుష్య నియంత్రణ బృందం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జెన్కో బిథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. బొగ్గు, నీటి వినియోగం, ఉత్పత్తి, నాణ్యత, కాలుష్య ఉద్గారాలు, నియంత్రణ చర్యలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ రక్షణ చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రామగుండం బి థర్మల్ స్టేషన్ను సందర్శించిన కేంద్ర బృందం - రామగుండం బి థర్మల్ స్టేషన్
పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని జెన్కో 62.5 మెగావాట్ల థర్మల్ (బి) విద్యుత్ కేంద్రాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్టీపీసీ ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది.
యూత్ కంట్రోల్ బోర్డు స్విచ్ యాడ్ ఇతర విభాగాల పనితీరు, సాంకేతిక అంశాలు, ట్రిప్ కారణాలపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పనితీరు సామర్థ్యం పై అధికారులు వివరించారు. బిథర్మల్ విస్తరణలో భాగంగా అవసరమైన స్థానిక వనరుల గురించి అధికారులకు చెప్పారు.
బిథర్మల్ సందర్శనకు వచ్చిన సీఈఏను అఖిల పక్ష నాయకులు అడ్డుకున్నారు. కేంద్ర బృందాన్ని కలిసేందుకు అనుమతించమని కోరగా... సీఈఏ నిరాకరించారు. చివరకు కేంద్రం బృందం అధికారి అనుమతించగా... థర్మల్ స్టేషన్ను పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేశారు.
- ఇవీ చూడండి : మద్యపాన నిషేధానికి గ్రామ మహిళలు తీర్మానం