తెలంగాణ

telangana

ETV Bharat / state

నవంబర్ 15 నుంచి రామగుండంలో 'కిసాన్ బ్రాండ్' యూరియా

కిసాన్ బ్రాండ్ పేరిట యూరియా తయారుచేయనున్నట్లు... నవంబర్​ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు రామగుండం ఎరువుల కర్మాగారం అధికారులు... కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. కేంద్రమంత్రి సదానంద గౌడతో సమీక్షించి సెప్టెంబర్ చివరి వారంలో ప్లాంట్​ను సందర్శిస్తామని కిషన్ రెడ్డి అధికారులకు తెలిపారు.

By

Published : Aug 27, 2020, 3:31 PM IST

central minister kishan reddy review meeting with fertilizers
రామగుండం ఎరువుల కర్మాగారంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష

రామగుండం ఫెర్టిలైజర్, కెమికల్స్ లిమిటెడ్- ఆర్​ఎఫ్​సీఎల్.. ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. మొత్తం 460 శాశ్వత ఉద్యోగాలకు గాను.. ఇప్పటికే 278 మందిని భర్తీ చేశామని అధికారులు వివరించారు. మరికొందరిని త్వరలోనే తీసుకుంటామని తెలిపారు.

త్వరలోనే వస్తా..

ప్లాంట్‌తో పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ప్లాంటుకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని అధికారులు కోరగా.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో సుమారు రూ.55 కోట్లు సమకూర్చాల్సి ఉందని అధికారులు కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్ర మంత్రి సదానంద గౌడతో సమీక్షించి సెప్టెంబర్ చివరి వారంలో రామగుండం ప్లాంట్‌ను సందర్శిస్తానని కిషన్‌రెడ్డి అధికారులకు తెలిపారు.

సూచనలు

ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే యూరియాలో రాష్ట్ర అవసరాలకు సరిపడా కేటాయింపులు జరపాలని కిషన్‌రెడ్డి కోరారు. ప్రస్తుత కోటా ప్రకారం 50 శాతం ఎరువులు రాష్ట్రానికి కేటాయించి మిగతావి.. ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతాయని అధికారులు వివరించారు. స్థానిక అవసరాలకు వాడితే రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉందన్న కిషన్‌రెడ్డి.. ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలని కోరారు.

ఇదీ చూడండి:మన హైదరాబాద్ కలెక్టరమ్మ ఆలోచన.. బడిలోనే సాగుబడి!

ABOUT THE AUTHOR

...view details