పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎంగిలి బతుకమ్మను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పితృ అమావాస్య రోజే ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు పేర్చారు. అధిక మాసం కారణంగా... వచ్చే నెల 16 నుంచి బతుకమ్మను జరుపుకోవాలని పండితులు సూచించినా... పద్ధతి ప్రకారమే పండుగను నిర్వహించేందుకు మహిళలు ముందుకొచ్చారు.
బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు.. భక్తితో నిమజ్జనం చేశారు - ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలు
పితృ అమావాస్యను పురుస్కరించుకుని మంథనిలో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మలను పేర్చారు. వీధుల్లోకి చేరి... కోలాటాలు ఆడి ఉత్సాహంగా పండుగను నిర్వహించి.. భక్తిని చాటుకున్నారు.
బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు.. భక్తితో నిమజ్జనం చేశారు
సాయంత్రం 6 గంటలకు బతుకమ్మలతో వీధుల్లోకి చేరి.. ఆటలు ఆడారు. కోలాటాలతో పాటలు పాడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి భక్తిని చాటుకున్నారు.
ఇదీ చూడండి:ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు... తీరొక్క పూలు పేర్చి ఆట పాటలు